హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ‘హైడ్రా’ కదం తొక్కుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. “తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ చాల బాగుంది. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. భవిషత్ తరాలకు వీటి ఫలాలు అండనున్నాయని అయన కొనియాడారు. అక్రమ నిర్మాణాలు తొలగించి చెరువులు , కుంటలు పునరుద్దరించినట్లైతే హైదరాబాద్ నగరం ఒక సుందర నగరంలా తయారవుతుందని అన్నారు. వర్షాలు పడిన ప్రతిసారి ఇళ్లలోకి నీరు రావడానికి ప్రధాన కారణం చెరువులను, నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేయడమే ఇందుకు కారణమని నాగబాబు పేర్కొన్నారు. అపార్ట్ మెంట్ లలోకి కూడా నీళ్లు రావడం, కొన్ని సామాన్య ప్రాణాలు కూడా బలికావడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.
“తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ఇప్పటికైనా అందరు అర్ధం చేసుకోవాలని అయన కోరారు . రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని, నిబద్ధతతో కూడిన చర్యలను మనమందరం అభినందిద్దాం. రేవంత్ రెడ్డి గారూ… మా సంపూర్ణ సహకారం మీకే” అంటూ నాగబాబు సోషల్ మీడియాలో స్పందించారు.