హైడ్రా కూల్చివెతలపై ఏఐసీసీ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఎక్స్ వేదికగా స్పందించారు . దుర్గం చెరువు పరిధిలో తన సోదరుడు పల్లం ఆనంద్ స్పోర్ట్ వెంచర్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేయడం బాధాకరమని అయన పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ప్రజాజీవితంలో స్వచ్ఛమైన రికార్డును కలిగి ఉన్న తమపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధగా ఉందని అన్నారు.
నా సోదరుడు ఆనంద్ 7 ఎకరాలు భూమి లీజుకు తీసుకొని స్పోర్ట్స్ వెంచర్ (ఆర్వోఆర్) ఏర్పాటు చేశారని, ఇందుకోసం తీసుకున్న అనుమతులను పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేయడం బాధాకరం అన్నారు . ఆనంద్ కష్టపడి సంపాందించిన డబ్బులతో దీన్ని ఏర్పాటు చేశారని పల్లంరాజు ఎక్స్‌లో పోస్టు చేశారు.