Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రజల నుండి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలువురు వైసీపీ బాధితులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు కు తెలిపి సాయం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారినుంచి వినతులు స్వీకరించిన సీఎం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు తమ పొలాన్ని ఆక్రమించుకున్నార‌ని, త‌న‌కు న్యాయం చేయాల‌ని కడప జిల్లా, కొట్టాల గ్రామానికి చెందిన బత్తుల కృష్ణయ్య సీఎంకు ఫిర్యాదు చేశాడు. తాను పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామ‌ని వైసీపీ నేత‌లు బెదిరిస్తున్నారని, తన పొలం తిరిగి త‌న‌కు వచ్చేలా చేయాలని కృష్ణయ్య కోరారు.

త‌న‌కున్న రెండు సెంట్లు స్థ‌లాన్ని వైసీపీ అండ‌తో కొంత‌మంది ఆక్ర‌మించుకున్నార‌ని కాకినాడ రూరల్ మండలం, కరపకు చెందిన దారపు మణికుమారి అనే మహిళ సీఎంకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా 10,500 మంది, పరోక్షంగా 5,000 కుటుంబాలకు ఉపాధి కలిగించే మీ సేవా కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, మీ – సేవా ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు. మీ సేవా కేంద్రాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని సీఎంను కోరారు. పలువురు అభాగ్యులకు అభయం ఇవ్వడంతో పాటు ఆర్థికం సాయం కూడా అందించారు.  గొల్లపూడికి చెందిన కొల్లా వెంకట్ అనే వ్యక్తి అన్న క్యాంటీన్ కు రూ.1 లక్ష విరాళంగా ఇవ్వగా ముఖ్య‌మంత్రి ఆయనను అభినందించారు.

 

 

RSS
Follow by Email
Latest news