Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణాలో భారీ సంఖ్యలో VRO నోటిఫికేషన్?

తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని  10,954 గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ లుగా పని చేసిన వారిని ఈ వ్యవస్థలో భాగం చేయాలని, ఇందుకోసం వారికి పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రద్దు అయిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. అందుబాటులో ఉండే గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ సహాయక అధికారులుగా పని చేసిన వారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అభ్యర్థులు లేని సమయంలో కొత్త నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం.

ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించగా మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం .  VRO, VRAలకు పరీక్ష నిర్విహించి అందులో మెరిట్ సాధించిన వారికి అవకాశం కల్పిస్తారు. ఇందులో ఉద్యోగాలు మిగిలితే వాటిని కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. VRO, VRAలకు తప్పనిసరిగా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటేనే పరీక్ష రాయడానికి అర్హులుగా సూచించారు. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 వయసు గల వారు అర్హులు. అయితే ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఇంకా విడుదల కావాల్సివుంది.

RSS
Follow by Email
Latest news