Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారత్‌ బంద్‌ ప్రశాంతం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

భారత్‌ బంద్‌కు మద్దతు ఇచ్చిన మాయావతి

భారత్‌ బంద్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు పలికారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వెనుక బీజేపీ కుట్ర దాగుందని ఆమె ఆరోపించారు. అందుకే తాము భారత్‌ బంద్‌కు మద్దతు ఇస్తున్నామని  ఆమె తెలిపారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

ఆగస్టు 1న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీలను ఉప కులాలుగా విభజించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేయడం, దానిని వెనక్కి తీసుకోవడమే లక్ష్యంగా భారత్ బంద్‌కు పిలునిచ్చామని మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు తెలిపారు.

ఈ నేపథ్యంలో అక్కడక్కడా శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారత్ బంద్‌కు కొన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, రవాణా, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు బంద్‌కు సంపూర్ణంగా సహకరించాలంటూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు పిలుపునిచ్చారు.

రాజస్థాన్ లో బంద్ పరిపూర్ణం :

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ ప్రభావం రాజస్థాన్‌లోని విద్యాసంస్థలపై కనిపించింది. బంద్‌ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్‌గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్‌పూర్‌లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్‌గఢ్‌లో  షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు.

ఢిల్లీలో బంద్ 

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నేడు (బుధవారం) భారత్‌ బంద్‌కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పలుపునిచ్చింది. అయితే ఈ బంద్ ప్రభావం ఢిల్లీలో పాక్షికంగా కనిపించింది.

RSS
Follow by Email
Latest news