అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను కూల్చేస్తు వస్తుంది. ఈ క్రమంలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్చేస్తారనే వార్తలు వస్తున్నాయి . రంగారెడ్డి జిల్లాలో 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్ ను సైతం కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఫామ్ హౌస్ పై అందిన ఫిర్యాదులపై ఆయా ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఏ ఏ శాఖల నుంచి అనుమతులు ఇచ్చారనే కోణంలో హైడ్రా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జీవో 111 ను ఉల్లంఘించారా? లేక అప్పట్లో అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే నిర్మాణాలు జరిగాయా? అనే కోణంలో హైడ్రా అధికారులు హెచ్ఎండీఏ, పీసీబీ, ఇరిగేషన్ శాఖల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు కట్టినా వాటిని కూల్చివేస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు . ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్ రగడ హైకోర్టుకు చేరుకుంది. జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. కేటీఆర్ కు సంబందించిన జన్వాడ ఫామ్ హౌజ్ ను కూల్చొద్దంటూ రియల్టర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
అయితే , ఇప్పటికే FTL పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు . ఇక కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌజ్ కూడా FTL పరిధిలో ఉంది . దింతో ఈ ఫామ్ హౌజ్ ను కూడా కూల్చివేసే అవకాశం ఉండటంతో… ముందస్తుగా ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం .