Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల వాతావరణం మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. అనంతరం క్రమక్రమంగా పుంజుకున్నాయి .  సెన్సెక్స్ 102 పాయింట్లు లాభపడి 80, 905 వద్ద ముగియగా.. నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 24, 700 వద్ద ముగిసింది.

దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సిప్లా టాప్ లాభాల్లో కొనసాగగా . ..టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్ మరియు ఒఎన్‌జీసీ నష్టాల్లో ముగిశాయి .  ఇక రంగాలవారీగా చూస్తే.. రియల్టీ ఇండెక్స్ 1 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం క్షీణించగా.. ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, మెటల్, టెలికాం మరియు మీడియా 0.5-1 శాతం పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం పెరిగింది.

RSS
Follow by Email
Latest news