Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారానికి ఏర్పాట్లు

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 12 న ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్‌ ప్రక్కన జరిగే పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 11 ఏకరాల స్థలంలో సభను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు లక్ష మంది వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్జేజీని సిద్ధం చేస్తున్నారు.

టీడీపీ నేత అచ్చెన్నాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆయనతోపాటు సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్త, ప్రత్యేకాధికారులు ప్రద్యుమ్న, బాబు, వీర పాండ్యన్‌, వ్యవసాయ శాఖ కమీషనర్‌ హరికిరణ్‌, రాష్ట్ర అదనపు డీజీపీ బాబ్జీ, ఐజీలు రాజశేఖర్‌బాబు, అశోక్‌ కుమార్‌, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, సీపీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ ఏర్పాట్లను పరిశీలించారు.

చంద్రబాబు ప్రమాణాస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచిం చారు. ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా సభ స్థలికి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి వరకు ఎస్ జీ టీ కమాండోస్ కి సభ ప్రాంగణాన్ని అప్పగించనున్నారు. ప్రధాన మంత్రి సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన సభా వేదిక వద్దకు చేరుకు నేందుకు వీలుగా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

RSS
Follow by Email
Latest news