ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. సిఎస్ పదవి నుంచి అధికారికంగా ఆయన వైదొలగినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సిఎస్ ఎంపిక కూడా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. బుధవారంద చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఆయనను కొనసాగించే ఉద్దేశం టీడీపీ ప్రభుత్వానికి లేదనే సమాచారాన్ని అందించారు. దీంతో గురువారం జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతో సెలవు పై వెళుతున్నట్లు సిఎస్ లేఖలో పేర్కొన్నారు.
దింతో ఏపీకి కొత్త సీఎస్ గా విజయానంద్ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయన ప్రస్తుతం apspdcl చైర్మన్ గా, అలాగే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.