అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎంగా భద్రత కారణాలు, అలాగే పరిపాలనాపరమైన కారణాలతో ఇన్నాళ్లు నాంపల్లి కోర్టులో వ్యక్తి గత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిపాలైన విషయం తెలిసిందే. దింతో అయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇకపై ప్రతి శుక్రవారం అయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పండింది.