ఆమె ఒక సాదాసీదా అంగన్వాడీ టీచర్, కానీ ఆమెకు రాజకీయాలపై ఆసక్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అంగన్వాడీ టీచర్ కాస్త ఎమ్మెల్యే అయ్యింది. వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించింది రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషా దేవి. రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో శిరీష గెలిచారు. వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మి కి 80,948 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శిరీషకు 90,087 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద అంగన్వాడీ టీచర్ నుండి ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి శిరీష అడుగుపెట్టనున్నారు.