హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దింతో నగరంలోని రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుండి ఇళ్లకు చేరే వాహనదారులు రెండు గంటల పైగా రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ముఖ్యంగా బైక్లు, బస్సుల్లో ప్రయాణించే వారంతా ఇళ్లకు చేరుకునేందుకు మెట్రో రైలు ఆశ్రయించారు. దింతో అవి కూడా కిక్కిరిసేలా నిండిపోయాయి. అయితే, మియాపూర్ – ఎల్బీనగర్ మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మెట్రో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. దీంతో ఆయా స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.