Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఎన్​డీఏ కూటమి 400 ఎందుకు రాలేదు… అసలు కారణం ఇదే

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో ఎన్​డీఏ 400స్థానాలకుపైగాకుపైగా సాధించాలని బీజేపీ వేసుకున్న అంచనాలు తప్పాయి. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్​డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షాలు కీలకం కానున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు మించి ఇండియా కూటమి సత్తా చాటింది. ప్రధానంగా యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది.

బీజేపీకి ప్రధానంగా రిజర్వేషన్ల అంశం వెంటాడింది. దేశంలో ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువగా ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ రెండు సామాజిక వర్గాలు బీజేపీకి మద్దతు ఇచ్చాయి. కానీ ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లపై బీజేపీ నేతలు చేసిన కామెంట్స్‌ విపక్షాలకు ప్రాణం పోశాయి. రాజ్యాంగాన్ని మార్చివేస్తామన్న బీజేపీ నేతల మాటలను ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయి. రిజర్వేషన్లను రద్దు అంశాలన్ని ఇండి కూటమి మారుమూల ప్రాంతాల్లోకి బలంగా తీసుకెళ్లింది. దాంతో.. తమ రిజర్వేషన్లపై బీజేపీ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనతో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు సమాచారం. అయితే.. కాంగ్రెస్‌ విమర్శలను ప్రధాని మోదీతోపాటు ఆపార్టీ అగ్రనేతలు తిప్పికొట్టినా, పార్టీ యంత్రాంగం ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది.

RSS
Follow by Email
Latest news