ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు కేరింతలు కొడుతూ ఫలితాలను ఆస్వాదించారు. చంద్రబాబు మనమడు , లోకేష్ కుమారుడు, నారా వారసుడు దేవాన్ష్ చేత కేక్ కట్ చేపించారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా నారా లోకేశ్ తన తల్లి భువనేశ్వరిని హత్తుకుని ఆనందం వెలిబుచ్చారు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.