ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఏపీ సిఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సాయంత్రం పంపించారు. ఏపీలో టీడీపీ జనసేన,బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. కూటమికి 165 సీట్లు వచ్చాయి. ఇక అధికార వైసీపీ మాత్రం కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణస్వీకారం, క్యాబినెట్ ఏర్పాటు తదితర అంశాలపై కూటమి పార్టీలతో చర్చించనున్నారు చంద్రబాబు. దీనిపై రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.