బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలుగు నటి హేమ అరెస్టు అయ్యారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నారని కర్ణాటక పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. సోమవారం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్కు వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విచారణకు రావాలని హేమతో పాటు… రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చారు. మొదటిసారి గత సోమవారం విచారణకు హాజరు కావాలని, రెండోసారి జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు. బెంగళూరు పోలీసులు నటి హేమను కోర్టులో హాజరు పరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు..