తెలంగాణ అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని అన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఇక్కడకు వచ్చే అర్హత సోనియాకు వంద శాతం ఉందని ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ప్రమేయం ఎక్కడుందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీని ఉద్యమ కారులు ఎప్పటికైనా గౌరవిస్తారని అన్నారు.
ఆనాడు తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోకపోతే, యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటిని ఒప్పించి, తెలంగాణ ప్రజల కల సాకారం చేసిందన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగినా, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి ఆమెను, పార్టీని ప్రశ్నించే అర్హత కిషన్ రెడ్డికి లేదని అన్నారు.