Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణ ప్రాంత కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఏంటి : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జయజయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది ‘నాటు నాటు’ పాట కాదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల మంది ప్రజల కలల ప్రతిరూపం అని మంగళవారం ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడి పెత్తనం ఏంటంటూ ప్రశ్నించారు.

తెలంగాణ వచ్చి పదేళ్లయినా ఈ ప్రాంత కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలమని ప్రశ్నించారు. రణనినాదం, ధికార స్వరమైన అందెశ్రీ ఇచ్చిన ఒరిజినల్‌ ట్యూన్‌తోనే గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలపించిందని అయన తెలిపారు. అందెశ్రీ అమాయకుడు, నిస్సహాయుడని అందుకే మౌనంగా కూర్చున్నాడని, మీరేం చేసినా భరిస్తున్నాడని సీఎం రేవంత్‌రెడ్డిని పరోక్షంగా విమర్శించారు.

RSS
Follow by Email
Latest news