బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో ఇటీవల అయన చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఈసీ సీరియస్ అయింది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు అంటే ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది.