“కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, రుద్రమదేవి, పటాస్, రేసుగుర్రం” చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించిన “విక్రమ్ లగడపాటి”…. టీనేజ్ హీరోగా “గోలిసోడా” చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో “ఎవడూ తక్కువ కాదు” పేరుతో అనువాదమై… ఈ కుర్రాడు అల్లాటప్పా కుర్రాడు కాదు… తనొక “స్టార్ మెటీరియల్” అని నిరూపించింది.
అల్లు అర్జున్ టైటిల్ రోల్ ప్లే చేసిన “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”లో విక్రమ్ పోషించిన అన్వర్ అనే ముస్లిం కుర్రాడి పాత్ర నటుడిగా అతని ప్రతిభకు అద్దం పట్టింది. దిల్ రాజు నిర్మించిన “రౌడీ బాయ్స్” చిత్రంలో రౌడీ కుర్రాళ్లలో ఒకడిగానూ నటించి మెప్పించాడు విక్రమ్!!
తాజాగా ఈ “లగడపాటి యువతేజం” నటించిన “వర్జిన్ స్టోరీ” అహాలో ప్రసారమవుతూ అసాధారణ స్పందన రాబడుతోంది. ప్రదీప్ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో విక్రమ్ సరసన సౌమిక నటించింది. యువతరం బ్రహ్మరథం పడుతున్న ఈ చిత్రాన్ని పెద్దలు సైతం బాగానే ఆస్వాదిస్తున్నారు.
నంబర్ వన్ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ “ఆహా”లో “వర్జిన్ స్టోరీ”కి వస్తున్న అద్భుత ఆదరణ గురించి మాట్లాడుతూ… ఇంత గ్రాండ్ రెస్పాన్స్ తాను అస్సలు ఊహించలేదని పేర్కొన్న విక్రమ్… ఈ క్రెడిట్ అంతా ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ చెందుతుందని అన్నాడు.
తను హీరోగా నటించే తదుపరి చిత్రంతోపాటు… ఓ వెబ్ సిరీస్ కు సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని చెప్పిన విక్రమ్ లగడపాటి. “వర్జిన్ స్టోరీ”ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు!!