Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాళేశ్వరంపై విచారణ చేపట్టాలంటూ… ఢిల్లీ లో నిరసన చేపట్టనున్న YS షర్మిల

తెలంగాణాలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం దీని నిర్మాణంలో భారీ స్కామ్ జరిగింది, కావున ఈ  కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మార్చి 14వ తేదీన ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ ర్యాలీగా వెళ్లాలని YSRTP అధినేత్రి షర్మిల నిర్ణయం తీసుకున్నారు. 2జీ స్పెక్ర్టమ్, కోల్ స్కాం కంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ స్కాం జరిగింది. దీనిని కేవలం కమీషన్ల కోసమే కట్టారని షర్మిల ఆరోపించారు. ఇది అవసరం లేని ప్రాజెక్టన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.

అనాడు రాజశేఖర్ రెడ్డి రూ.38 వేల 500 కోట్ల వ్యయంతో అంబేడ్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రూపొందించారని, దీని ద్వారా 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు అందించాలని ప్లాన్ చేశారని వైఎస్ షర్మిల చెప్పారు. కానీ,  రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు ఖర్చును మూడింతలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీ డిజైనింగ్ పేరుతో ఒక లక్షా 20 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుపై ఖర్చు పెట్టి … కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాతమ్రే నీళ్లు ఇచ్చేలా నిర్మాణం చేశారని ఆరోపించారు.

గతంలో గోదావరి నదికి ఎంత పెద్ద వరద వచ్చినా స్థానిక రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల బ్యాక్ వాటర్ తో రైతుల పంటలు ముప్పునకు గురవుతున్నాయని షర్మిల అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన 80 శాతం ప్రాజెక్టులను ఒకే ఒక కాంట్రాక్టర్ కు ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

 

RSS
Follow by Email
Latest news