Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణ స్టేట్ ఖోఖో నూతన ప్రెసిడెంట్ గా జంగా రాఘవరెడ్డి

తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ హనుమకొండ ఆఫీసర్ క్లబ్ లో ఈరోజు జరిగింది. అలాగే, ఎలక్షన్ లో తెలంగాణ స్టేట్ ఖోఖో ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది. నూతనంగా శ్రీ జంగా రాఘవరెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది. ఈ ఎన్నికల అధికారిక అడ్వకేట్ కురుమ శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు. ఎన్నికల అబ్జర్వర్సగా మేకల సీతారాం రెడ్డి, ఆలిండియా ఖోఖో ఫెడరేషన్ నుంచి ఒలంపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ గా బి కైలాస్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అబ్జర్వర్ గా జి.అశోక్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఖోఖో స్టేట్ ప్రెసిడెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్స్ చైర్మన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… నా మీద ఎంతో నమ్మకంతో నన్ను తెలంగాణ స్టేట్ ఖోఖో ప్రెసిడెంట్ గా నియమించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలూపుకుంటున్నాను అన్నారు. అదేవిధంగా నాతోపాటు ఇతర పదవుల్లో గెలిచినవారు వారు కర్తవ్యాన్ని తూచా తప్పకుండా నిజాయితీగా పనిచేయాలని కోరారు.

అసోసియేషన్ సెక్రెటరీ రామకృష్ణ ఇటీవల మరణించడం తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఖోఖో కు తీరని లోటు అని జంగా విచారం వ్యక్తం చేశారు. యువత అత్యున్నత స్థాయిలో ఎదగాలనే ఆలోచనతో ముందుండి వారిని ప్రోత్సహించేవారు. ఇప్పుడు అయన లేని లోటును తీర్చడం కష్టమే అవుతుందని అన్నారు. ఇప్పుడున్న కొత్త సెక్రెటరీ కూడా అదేవిధంగా యువకులకు ప్రోత్సాహాన్ని అందించాలని రాఘవరెడ్డి కోరారు. తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారికి పూలదండలతో, శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్, మండల సమ్మయ్య, బన్న విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news