Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నా భార్య అలిగింది, ఆమెను బుజ్జగించేందుకు 10 రోజులు సెలవులు కావాలి : పోలీస్ ఇన్‌స్పెక్టర్

హోలీ జరుపుకునేందుకు పుట్టింటికి తీసుకెళ్లనందుకు నా భార్య అలిగింది, ఆమెకు నచ్చజెప్పి, బుజ్జగించేందుకు 10 రోజులు సెలవులు కావాలని ఎస్పీకి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాసిన లీవ్ లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ఆవేదన. వృత్తి రీత్యా పండుగల వేళా సెలవులు దొరక్క పోవడంతో గత 22 ఏళ్లుగా తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానని అయన ఆవేదన వ్యక్తం చేశారు.

తనతో కలిసి పుట్టింటికి వెళ్లాలని తన భార్య కోరుకుంటోందని, కాబట్టి తనకు ఈసారి తప్పనిసరిగా సెలవులు కావాలని పేర్కొన్నారు. తన సమస్యను పరిగణనలోకి తీసుకుని పది రోజులు సెలవు మంజూరు చేయాలని పై అధికారిని  కోరారు. ఈ లీవ్ లెటర్ చదివిన ఎస్పీ అశోక్ కుమార్ మీనా ఇన్‌స్పెక్టర్ కోరినట్టు కాకుండా ఐదు రోజుల సెలవులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది.

RSS
Follow by Email
Latest news