మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,500 గా ఉంది. విశాఖ, విజయవాడలో కూడా ఇదే ధర ఉంది. కిలో వెండి ధర రూ. 70 వేలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలలో కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది.
ఈ నెలలో ఇప్పటికే బంగారం ధర రూ. 2 వేల వరకు తగ్గింది. రాబోయే రోజుల్లో మళ్లీ ధరలు పెరుగుతాయేమో అనే ఆలోచనలో మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. తమ భవిషత్ అవసరాల నిమిత్తం ఇప్పుడే కొనుక్కోవడం బెటర్ అనే ఆలోచనతో… బంగారం కొనేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.