ప్రజాజీవన శక్తిసామర్థ్యుడి మైండ్ లో రిజిస్టర్ కావాలని, ఆయన చల్లని చూపు ప్రసరించాలని మామూలుగానే 365 రోజులూ రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. ఇక పుట్టినరోజు సందర్భంలోనైతే ఆ ఉబలాటాలు కుండపోత వర్షాలు, కాళేశ్వర గంగ పరవళ్ళతో పోటీ పడుతుంటాయి. ఎందుకంటే ఆయన వర్తమాన వారధి, భవిష్యత్తు సారథి కాబట్టి! నడుస్తున్న చరిత్రకు, జరగబోయే చరిత్రకు నిలువెత్తు చిరునామా, సంతకమూ కాబట్టి! ఈ శుభ తరుణంలో ఎపి-టిఎస్ సైట్ యధార్థానికి దగ్గరగా ఆ ఎక్స్ క్లూజీవ్ లీడర్ ను ఆవిష్కరించే ప్రయత్నానికి అక్షర తెర ఇది!!
పల్లెటూరులో వారి యాసలో, పట్నంలో వాళ్ళ శైలిలో, ప్రపంచ వేదికలపై యూనివర్సల్ గా అల్లుకుపోయే వాక్పటిమ. రూరల్ టు గ్లోబల్ ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకునేలా కట్టిపడేసే సులువైన భాష. స్పష్టతకే స్పష్టతనిచ్చేలా మదిలో పదిలంగా స్థిరమయ్యేంతటి భావ వ్యక్తీకరణ. అనితరసాధ్యమైన విశేష బాడీ లాంగ్వేజ్. సౌహార్ద హృదయులు. రౌండ్ ది క్లాక్ ఫ్రెష్ అప్పియరెన్స్. కడుపులో ఉన్నదే కళ్ళల్లో ప్రస్ఫుటం. ఉన్నది ఉన్నట్టు పలికే నిర్మొహ”మాట”నే చేతల్లో చాటుతారు. వాస్తవానికి దగ్గరగా ఉంటారు. ఉంచగలుగుతారు.
నిన్నటికంటే ఇవాళ, ఈరోజుకు మించి రేపు, అంతకుమించిన భవిష్యత్తుకు ఎప్పటికప్పుడు ఎంతమందికి ఉపయోగపడ్డాం. ఉజ్వల సమాజానికి ఇంకా ఏం చేయాలి. ఉత్పాదక శక్తిని ఏ విధంగా బలోపేతం చేద్దాం. ఒకరు ఎదగాలి. ఎదిగిన వారు పది మందికి బతుకుదెరువు ఇవ్వాలి. మొత్తంగా హై ఎండ్ సంపన్నులే కాదు, టేలెండ్ సామాన్యుల వరకూ కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కోసం ఆరోగ్యకరమైన సొసైటీ, సుభిక్ష స్థితిగతులపైనే ఆయన ధ్యాస.
బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలయ్యే భేటీలు, క్షేత్ర పర్యటనలు, పరిశీలనలు, సమీక్షలతో ముఖాముఖి సంభాషణలు. గతంపై రివ్యూలు, ఫాలో అప్ లు. భవిష్యత్తు ప్రణాళికలు. ఇత్యాది వాటికి దినమంతా లెగ్ వర్క్. ట్రావెల్ టైంలోనూ, లేట్ నైట్ దాకా సాంకేతిక పరిజ్ఞానంతో హాండ్, హోం వర్క్. టోటల్ గా చేయగలిగిన దానికి మించి..! అందుకే రూరల్ టు గ్లోబల్ ఆయనది ఎక్స్ క్లూజివ్ పొజిషన్. చివరాఖరికి అపోజిషన్ వారైనా ఆఫ్ ది రికార్డులో అప్రిషియేట్ చేసేంతటి అజాత శత్రువు!
రాష్ట్ర మంత్రి విదేశాంగ మంత్రి స్థాయి కెపాసిటీ కలిగి ఉండడమైనా, ఒక యూఎస్ మహిళా వ్యాపారవేత్త తనలో భారతదేశ భావి ప్రధానమంత్రిని దర్శించడమన్నా…ఊరకే ఏర్పడిన అంచనాలు కానేకావు. పైకి సుకుమారంగా కనిపించినా…కఠోర, కఠిన, లోతైన కసరత్తులే అసలు కారణం. కాబట్టే వర్తమానానికి వారధి అయ్యారు. వచ్చే కాలానికి సారథి అయ్యే యోగ్యత ఆల్రెడీ సొంతం చేసుకున్నారు. కన్ను కుట్టిన కొందరంటారు. లీడర్ గా ఆయనకు అర్బన్ లో మాత్రమే ఆమోదం ఉందని. కానీ రూరల్ లోనూ బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నది.
బేసిగ్గా ఎన్నికల్లో పోటీకి శ్రీకారం చుట్టిందే ఏక్ దమ్ కడక్ రూరల్ నుండి. 2009 నుంచి తాను వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకనాటి కల్లోల సిరిసిల్లను ఎంతలా కళకళలాడిస్తున్నారంటే… రాజకీయ ప్రత్యర్ధుల దిష్టి తగిలేంత! సిరిసిల్ల టు దావోస్…ప్రాక్టికల్ గా ఇంట గెలిచి, రచ్చ గెలిచిన యూనీక్ లీడర్. అంతకుముందు టీఆర్ఎస్ నాయకుడిగా ఉంటూనే, మొదటిసారి ఎలక్షన్స్ లో 2009లో సిరిసిల్ల నుండి అసెంబ్లీకి పోటీ చేశారు.
అప్పటి నుంచి తిరుగులేని విజేతగా నిలుస్తున్నారు. పుష్కర కాలం (2009) నుండి చూస్తుండగానే ఎక్స్ క్లూజీవ్ గ్లోబల్ లీడర్ గా ఎదుగుతూ ఖ్యాతి గడిస్తున్నారు. అందుకే తెలంగాణలో అందరి బంధువు అయ్యారు మన కల్వకుంట్ల తారక రామారావు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మునిసిపల్ శాఖల మినిస్టర్ కె.టి.రామారావుకు ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ ఎండి బన్న ప్రభాకర్, యాజమాన్యం తరపున, నా పక్షాన మనసారా జన్మదిన శుభాకాంక్షలు.
దుర్గాప్రసాద్