Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి రాశి ఫలితాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️

🚩(21-07-2022) రాశి ఫలితాలు🚩

మేషం
21-07-2022

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికీ పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు.
—————————————
వృషభం
21-07-2022

దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
—————————————
మిధునం
21-07-2022

ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చాలాకాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.
—————————————
కర్కాటకం
21-07-2022

స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయాలు చెయ్యలేరు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
—————————————
సింహం
21-07-2022

వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ప్రయాణాలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది.
—————————————
కన్య
21-07-2022

వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.
—————————————
తుల
21-07-2022

ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
—————————————
వృశ్చికం
21-07-2022

ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణ విషయంలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ యత్నాలు చేస్తారు.
—————————————
ధనస్సు
21-07-2022

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
—————————————
మకరం
21-07-2022

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
—————————————
కుంభం
21-07-2022

వ్యాపారాలలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు.
—————————————
మీనం
21-07-2022

ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లక పోవడానికి మంచిది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి.
—————————————
🍁శుభం భూయాత్☘️ 🔹 ముక్తినూతలపాటి వాసు 🔹

RSS
Follow by Email
Latest news