దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన kకొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అయితే, చివరి వరకు నష్టాలతోనే ముగిశాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 508 పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయింది. కొంత మేరకు టెలికాం, యుటిలిటీస్, పవర్, రియాల్టీ సూచీలు లాభాల్లో నిలిచాయి.