Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అమర్‌నాథ్‌ యాత్రకి వెళ్లిన 35 మంది తెలుగు వారు గల్లంతు..!

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని ఆ జిల్లా కలెక్టర్‌ చక్రధర్ బాబు తెలిపారు. వీరిలో వీరిలో ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఉన్నారని, 37 మంది గల్లంతైనారని అయన  తెలిపారు. గల్లంతైన వారిలో ఒకరు చనిపోగా.. మరొకరి ఆచూకీ తెలియలేదు.

అయితే, చనిపోయిన మహిళ రాజమహేంద్రవరంకు చెందిన గుణిశెట్టి సుధ (48)గా గుర్తించారు. ఆచూకీ తెలియని పార్వతి (57) అనే మరో మహిళ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టు జిల కలెక్టర్ వెల్లడించారు.

ప్రతికూల వాతావరణం కారణంగా తాత్కాలికంగా రద్దయిన అమర్‌నాథ్‌ యాత్ర తిరిగి ప్రారంభమయింది. జమ్మూ బేస్‌ క్యాంప్‌ నుంచి 4,026 మంది భక్తులతో ఒక బ్యాచ్‌ సోమవారం తెల్లవారుజామున బయలుదేరింది. వీరందరిని సీఆర్‌పీఎఫ్‌ భద్రతతో కూడిన 110 వాహనాల్లో తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

RSS
Follow by Email
Latest news