టీమిండియా, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్) మ్యాచ్ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. తొలి రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వర్షం జోరుగా కురవడంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. అప్పటికే టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. భారత్ స్కోరు 27 పరుగుల వద్ద ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (17) పరుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ ఛటేశ్వర్ పుజారా (13) పరుగుల వద్ద వెనుదిరిగాడు. హనుమ విహారి 14, విరాట్ కోహ్లీ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో వర్షం ఏకధాటిగా కురవడం, ఇంతకు తగ్గకపోవడంతో అంపైర్లు ముందుగానే లంచ్ విరామం ప్రకటించారు. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఈ రెండు వికెట్లు తీశాడు.