Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఎన్నారై టిడిపి కార్యకర్తల బలోపేతానికి చర్యలు…!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా సౌత్ ఆఫ్రికా దేశం లో టిడిపి ఎన్ఆర్ఐ శాఖ ఘనంగా మహానాడు వేడుకలు మే14 న జోహనేస్బర్గ్ లో నిర్వహించారు. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరుపుకుంటున్న సౌత్ఆఫ్రికా మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి మాజీ మంత్రి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ కె.ఎస్.జవహర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి గౌతు శిరీష హాజరయ్యారు. ఈసందర్బంగా సౌత్ ఆఫ్రికా లోని వివిధ నగరాల నుంచి ఎన్ఆర్ఐ టిడిపి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈసందర్బంగా గౌతు శిరీష మాట్లాడుతూ.. జన్మభూమి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొనసాగింపుగా GFST గ్లోబల్ ఫారం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక అంశంగా అందరూ గుర్తించి ముందుకు నడిపించాలని ఆమె పేర్కొన్నారు. అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యత్వాలు మీద గౌతు శిరీష తీర్మానం ప్రవేశ పెట్టారు.

కార్యక్రమంలో జవహర్ గారు మాట్లాడుతూ..ప్రతి ఒక్క ఎన్నారై టిడిపి కార్యకర్త రానున్న ఎన్నికల్లో పార్టీకి అందుబాటులో ఉండాలని కోరారు. అదేవిధంగా  ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ టీడీపీ సమస్యల మీద పార్టీ  స్పందిస్తుందని తెలియజేశారు. ఎన్ఆర్ఐ టీడీపీ ని బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా పార్టీ సంసిద్ధంగా ఉన్నదని, పార్టీ భవిష్యత్తులో చేయబోయే సహకారాలు మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

RSS
Follow by Email
Latest news