Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

లోకకల్యాణార్థం నిర్వహించే నృసింహ హోమం లో అందరు భాగస్వాములవండి : వేద విజ్ఞాన సమితి

అతి పవిత్రం, అత్యంత శక్తివంతం అయిన శ్రీ నృసింహ పాశుపత, మూలమంత్ర పూరిత హోమం 14 మే, 2022 న నృసింహ జయంతి సందర్భంగా వేద విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని అన్నారు. సకల జన శ్రేయస్సు, ఆయురారోగ్య వృద్ధి, అభీష్ట సిద్ధి కొరకు వేద విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నృసింహ హోమం కార్యక్రమంలో హిందూ బంధువులందరూ భాగస్తులై తమ సహాయ సహకారాలు అందించి, నృసింహస్వామి వారి కరుణా కటాక్షాలు పొందగలరని కోరారు.

నృసింహ హోమం మంత్రోచ్ఛారణలు విన్నంతనే శరీరం, మనసు అలౌకికమైన అనుభూతితో కూడిన మార్పులకు లోనై జీవితంలో శుభకరమైన మార్పులు చోటు చేసుకొంటాయనేది వేదపండితుల అనుభవపూర్వక అభిప్రాయం. ఈ అనుభూతిని, శుభ ఫలితాలనూ అందరికీ అందించాలనే సంకల్పంతో, వేద విజ్ఞాన సమితి ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి మీ సహాయం/విరాళం/సేవా రుసుము గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 8008518151 (అనూరాధ) నంబర్ కు చెల్లించి, వివరాలు ఇదే మెసేజ్ కి రిప్లైగా పంపించాలని కోరారు. ఇతర వివరాల కొరకు 9182624182 నంబర్ కు కాల్ లేదా మెసేజ్ చేసి తెలుసుకోవాలని తెలిపారు.

RSS
Follow by Email
Latest news