Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

జర్నలిస్టు పిల్లల అందరికీ ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఫీజులో రాయితీ..

కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లల అందరికీ ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలల్లో ఫీజులో రాయితీ కల్పించడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు… జర్నలిస్టు పిల్లల ఫీజు రాయితీ  విషయమై టీయూడబ్ల్యూజే (H-143) జిల్లా అధ్యక్షుడు బోనాల మల్లికార్జున్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఫీజులో రాయితీ పై రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్ట్ నివాస స్థలాల కేటాయింపుపై చర్చించగా త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ… ఫీజుల రాయితీ , నివేశన స్థలాల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించటం పై ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్ట్ సమస్యలపై TUWJ (H-143) యూనియన్ ఎల్లప్పుడూ పోరాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి బోనాల తిరుమల్, టెంజు అధ్యక్షుడు విజయ భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల హృషీకేష్ పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news