Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మాయాజాలం

  • పన్నుల పేరుతొ ప్రజలను ఎంతలా దోచుకుంటున్నారో…
  • ఆర్టీఐ ద్వారా బయటపడిన నిజాలు…
  • సగానికి సగం దోచుకునుడే…

సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని గొప్పలు చెపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు… మరోవైపు పన్నుల రూపంలో సగానికి సగం ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వాలకు అధికమొత్తంలో రాబడి వచ్చే వస్తువులను మాత్రం జీఎస్టీ లోచేర్చి తమ ఖజానా నింపుకుంటున్నారు. అదే డీజిల్, పెట్రోల్ ను మాత్రం జీఎస్టీ లో చేర్చకుండా మరోవిధంగా పన్నులు వసూలు చేసుకుంటున్నారు. అంతిమం ఏదైనా వారి ఖజానా నిండడమే వారికీ కావాల్సింది. వంట గ్యాస్ విషయంలో ఓ వినియోగదారుడు ఆర్టీఐ ద్వారా అసలు విషయాన్నీ బయట పెట్టారు. ఆవివరాలు…

ఒక సిలిండర్ వంట గ్యాస్ ధర. రూ. 545 . 00 దీనిపై
కేంద్ర ప్రభుత్వ పన్ను రూ. 24. 75 అలాగే కేంద్ర
రవాణ చార్జీలు రూ. 10. 00
————-
మొత్తం ధర రూ. 579. 75, ఒక సిలిండర్ ధరపై కేంద్ర ప్రభుత్వ పన్ను రూ. 24. 75 ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 291. 36 పన్ను రూపంలో వసూలు చేస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వ పన్ను రూ. 291. 36
రాష్ట్ర రవాణ చార్జీలు రూ 25. 00
డిలర్ కమీషన్ రూ 9. 50
సబ్ సీడి రూ 40. 57
———–
మొత్తం ధర రూ. 946. 18
డెలివరీ బాయ్ చార్జీ రూ 23. 82
————-
మొత్తం కలిపి కస్టమర్ చెల్లించేది రూ. 970. 00, ఇది కాకుండా.. అదనంగా 30 నుంచి 50 రూపాయలు డెలివరీ బాయ్స్ వాసువులు చేస్తున్నారు. అంటే 545 రూపాలున్న ఒక సిలిండర్ ధర ధరకుబదులు డబుల్ రేటుపెట్టి కస్టమర్ కొనాల్సి వస్తుందన్న మాట. ఒక్కసారి అలోచించండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాయాజాలం.

RSS
Follow by Email
Latest news