Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ర‌ష్యాకు గ‌ట్టి ఎద‌రు దెబ్బ…మానవ హక్కుల మండలి నుంచి తొలగింపు

ఐక్య‌రాజ్య స‌మితి లోని సభ్య దేశాలయొక్క మాన‌వ హ‌క్కుల మండలి (హ్యూమ‌న్ రైట్స్ కౌన్సిల్‌) నుంచి ర‌ష్యా ను బహిష్కరించారు. ఈ మేర‌కు ఐరాస స‌ర్వ ప్ర‌తినిధుల స‌భ (జ‌న‌ర‌ల్ అసెంబ్లీ) గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వ‌హించిన ఐరాస‌.. మెజారిటీ ఓటింగ్ అనుగుణంగా ర‌ష్యాను మాన‌వ హ‌క్కుల మండలి నుంచి బ‌హిష్క‌రించింది. 

ర‌ష్యాను మాన‌వ హ‌క్కుల మండలి నుంచి బ‌హిష్క‌రించాల‌న్న తీర్మానంపై జ‌రిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 93 దేశాలు ఓటేయ‌గా… ఈ తీర్మానానికి వ్య‌తిరేకంగా 24 దేశాలు ఓటేశాయి. అయితే ఈ ఓటింగ్ లో భార‌త్ పాల్గొనలేదు. అలాగే మరో 58 దేశాలు ఈ ఓటింగ్‌లో పాలుపంచుకోలేదు.

RSS
Follow by Email
Latest news