Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కొడాలి నాని కి కీలక పదవి

గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి నూతన మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈనేపథ్యంలో నాని కొంత అసంతృపితో ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో నానికి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టనున్నట్లు తెలిసింది. ఆయనకు ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. కేబినెట్‌ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు.

Latest news