Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కేసీఆర్ కి అస్వస్థత..?

యూపీ మాజీ సీఎం, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడే అయన రెండు రోజులపాటు పార్టీ కార్యాలయాలను పరిశిలించారు. అనంతరం ఆయనకు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం. దీంతో మరికొన్ని రోజులు అయన హస్తినలోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది.

తెలంగాణ సీఎంగా కొనసాగుతూనే దేశవ్యాప్తంగా పర్యటిస్తానని.. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణ కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలు సాగుతూనే ఉంటాయని ప్రకటించిన కేసీఆర్‌ ఢిల్లీలోనే మకాం వేశారంటే..? నిజంగా జ్వరంతోనే అక్కడ ఉన్నారా..? లేక ఇంకా ఏదైనా ప్లాన్‌ ఉందా? అని పలువురు నేది ఆసక్తికరంగా మారింది.

ఉత్తర భారత దేశానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల కీలక నేతలు, ప్రజాసంఘాల నేతలు, మేథావులు, సీనియర్‌ పాత్రికేయులను, ఆర్థికవేత్తలను కలువనున్నారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సీఎం కేసీఆర్‌ నుంచి తెలంగాణ ఉన్నతాధికారులకు పిలుపువచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకే ఉన్నతాధికారులను కేసీఆర్‌ ఢిల్లీకి పిలిచినట్టుగా సమాచారం

RSS
Follow by Email
Latest news