Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈరోజు రాశి ఫలితాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️
🔹 ముక్తినూతలపాటి వాసు 🔹

🚩(16-07-2022) రాశి ఫలితాలు🚩

మేషం
16-07-2022

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపార పరంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది.
—————————————
వృషభం
16-07-2022

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగాలలో శ్రమాధిక్యత మరింత పెరుగుతుంది. నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది. ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి.
—————————————
మిధునం
16-07-2022

ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు విఫలమౌతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.
—————————————
కర్కాటకం
16-07-2022

వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది.
—————————————
సింహం
16-07-2022

నూతన వ్యక్తుల పరిచయాల వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
—————————————
కన్య
16-07-2022

వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణం ప్రయత్నాలు వాయిదా వేస్తారు.
—————————————
తుల
16-07-2022

కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండక ఇబ్బందులు పెరుగుతాయి. మిత్రుల వలన సమస్యలు ఉంటాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
—————————————
వృశ్చికం
16-07-2022

ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి. దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి.
—————————————
ధనస్సు
16-07-2022

సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
—————————————
మకరం
16-07-2022

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
—————————————
కుంభం
16-07-2022

కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. అవసరం కానీ వస్తువులకు ధన వ్యయం చేస్తారు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది.
—————————————
మీనం
16-07-2022

వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబసభ్యులతో వివాహం విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగ పరంగా ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయి.
—————————————
🍁శుభం భూయాత్☘️

RSS
Follow by Email
Latest news