Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి రాశి ఫలితాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️

🚩(23-07-2022) రాశి ఫలితాలు🚩

మేషం
23-07-2022

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న పాటి మనస్పర్ధలు ఉంటాయి. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు.
—————————————
వృషభం
23-07-2022

అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
—————————————
మిధునం
23-07-2022

వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది.
—————————————
కర్కాటకం
23-07-2022

వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు.
—————————————
సింహం
23-07-2022

వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. భూ సంబంధిత వ్యాపారస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.
—————————————
కన్య
23-07-2022

అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. దైవ సేవా కార్యాక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
—————————————
తుల
23-07-2022

స్ధిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. కుటుంబమున మీ ఆలోచనలు ఎవ్వరికీ నచ్చవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి.
—————————————
వృశ్చికం
23-07-2022

రాబడి మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. శత్రువుల పై ఆధిక్యత సాధిస్తారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.
—————————————
ధనస్సు
23-07-2022

గృహమున కొన్ని సంఘటనలు గందరగోళంగా ఉంటాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.
—————————————
మకరం
23-07-2022

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి.
—————————————
కుంభం
23-07-2022

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. చేపట్టే పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.
—————————————
మీనం
23-07-2022

దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది.
—————————————
🍁శుభం భూయాత్☘️ 🔹 ముక్తినూతలపాటి వాసు 🔹

RSS
Follow by Email
Latest news