Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వరంగల్ లో తీన్మార్ మల్లన్న అరెస్ట్..!

👉 గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు…

👉 అరెపల్లి పోచమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత..

ల్యాండ్ పూలింగ్ జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులకు మద్దతుగా వరంగల్ కు వచ్చిన తీన్మార్ మల్లన్నను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా అరెపల్లి రైతుల గ్రామసభకు తీన్మార్ మల్లన్న హాజరైనారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ… ప్రభుత్వం తెచ్చిన జీఓ 80A ను ప్రభుత్వమే రద్దు చేసే వరకు పోరాటం చేయండి. దానికి నా పూర్తి మద్దతు .. మీకోసం ప్రబుత్వంతో కొట్లాడతా అని రైతులకు తన మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ నుండి వరంగల్ వస్తున్న మల్లన్నను అడ్డుకునేందుకు పోలీసులు ఎంత నిర్బంధం విధించినా బైక్ పై అరెపల్లికి చేరుకొని రైతులకు భరోసా కల్పించారు.

అయితే, అరెపల్లి పోచమ్మ దేవాలయంలో రైతులతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న పోలీసులు మల్లన్నను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి, పొలిసు వాహనంలో తీసుకెళ్లారు. ఈక్రమంలో గ్రామస్తులకు పోలీసులకు వాగ్వాదనాలు జరిగాయి. మాకు మద్దతు ప్రకటించిన మల్లన్నను ఎలా అరెస్ట్ చేస్తారంటూ…రైతులు ఆందోళనలకు దిగారు.  తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేయడానికి పోచమ్మ దేవాలయం లోకి షూ బూట్లతో పోలీసులు రావడంతో తమ మనో భావాలు దెబ్బతిన్నాయి అంటూ  ప్రజలు తిరగబడ్డారు.

RSS
Follow by Email
Latest news
కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ తో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ : నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ .. నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి..