Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

చంచల్ గూడ జైలు కు రాహుల్

ఏఐసిసి నేత రాహుల్ గాంధీ ఈ నెల 07 న చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైలు లో ఉన్న తమ పార్టీ  నేతలను పరామర్శిస్తారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు బలమూరి వెంకట్ తో పాలు 18 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ నెల 7న వీరిని పరామర్శించేందుకు చంచల్ గూడ జైలుకు రాహుల్ గాంధీ రానున్నారని, అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు  రేవంత్ రెడ్డి తెలిపారు.ఇందుకోసం చంచల్ గూడ సూపరింటెండెంట్ ని కలిసి వినతిపత్రం ఇచ్చామని వెల్లడించారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్ ని కోరామని అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిసేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారని,  అందుకు అనుమతి ఇవ్వాలని కోరిన విద్యార్థి నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలులో వేయటం అమానుషమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ఈరోజు ఎక్కడ ఉండేవారో గుర్తు చేసుకోవాలని రేవంత్ అన్నారు.

RSS
Follow by Email
Latest news