Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అధునాతన సౌకర్యాలతో వరంగల్ లో మున్నూరు కాపు భవనం నిర్మాణం

అధునాతన సౌకర్యాలతో వరంగల్ లో మున్నూరు కాపు భవనం నిర్మాణం చేయాలనిలక్ష్యంగా నిర్ణయించుకున్నాననీ
అందుకోసం అవసరమైన స్థల సేకరణ పై దృష్టి సారించినట్లు వరంగల్ తూర్పు ఎమ్మేల్యే  నన్నపనేని నరెందర్ పటేల్ చెప్పారు. ఈ భవనంలో TMKJF కు ప్రత్యేకవసతి సౌకర్యం కల్పిస్తాననీ హామీ ఇచ్చారు.నగరంలోని సాయి కన్వేన్షన్ హాల్లో ఆదివారం మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం( TMKJF)డైరీని ఎమ్మేల్యే ఆవిష్కరించారు. ఫోరం వరంగల్ జిల్లా అధ్యక్షుడు కత్తెరశాల కుమారస్వామి పటేల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్మ అతిథిగా పాల్గొన్న ఎమ్మేల్యే మాట్లాడుతూ.. జర్నలిస్టులకు తగు సహాయం అందించేందుకు ఎల్లప్పుడు  సిద్ధంగా ఉంటాననీ తెలిపారు.

తూర్పు నియోజకవర్గాన్ని విస్తృత స్థాయిలో అభివృద్ధి పరిచే క్రమంలో ముందు వరుసలో ఉన్నట్లు వివరించారు. ఇంతకు ముందెన్నడూ లేని ప్రగతిని తన హయాంలో చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు ఎమ్మేల్యే చెప్పారు. ఆత్మీయ అతిథిలుగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలక్ష్మణ్ పటేల్, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్
శెంకేశి శెంకర్ రావు పటేల్ ఆర్టీఎ కంచి వేణు పటేల్ తదితరులు మాట్లాడారు.

తూర్పు కార్పేటర్లను…నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్ లను ఎమ్మేల్యే సన్మానించి,జ్ఞాపిక అందచేశారు. ఫోరం జిల్లా కార్యదర్శి పాటి నరెందర్ స్వాగతం పలుకగా కోశాధికారి బజ్జూరి ప్రభాకర్ వందన సమర్పణ చేశారు. ఆర్గనైజర్ కమటం వేణుగోపాల్ పటేల్ నల్గోండ జిల్లా కన్వీనర్ తూడినార్దన్ పటేల్,మేడ్చల్ కన్వీనర్ దాదే వెంకట్ పటేల్, మహబూబాబాద్ ఉంగరాల సమ్మయ్య పటేల్, జనగామ రమేశ్ పటేల్ అధిక సంఖ్యలో జర్నలిస్టు సోదరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news
సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌ గ్రేటర్ హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డీసీపీల బదిలీలు సౌతాఫ్రికా అండర్‌-19 పై భారత్ అండర్ - 19 జట్టు క్లీన్‌స్వీప్ జనవరి 28 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు...? కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ తో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ : నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ .. నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు