Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఐర్లాండ్ పై ఆసీస్ ఘన విజయం

టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో క్రికెట్ పసికూన ఐర్లాండ్ పై  ఆతిథ్య ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. 180 పరుగుల విజయ లక్షయంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ జట్టు 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. ప్యాట్ కమిన్స్, మ్యాక్స్ వెల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు సాధించగా, స్టొయినిస్ 1 వికెట్ తీశాడు.

ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ లొర్కాన్ టకర్ ఒంటరిపోరాటం చేశాడు. టకర్ 48 బంతుల్లోనే 71 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. టకర్ చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ అతడికి ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సహకారం కరవైంది.

కాగా, ఈ విజయంతో ఆస్ట్రేలియా సూపర్-12 గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ఆసీస్ ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు నమోదు చేసింది.

RSS
Follow by Email
Latest news