Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంచుతారా? ఆక్రమించమంటారా?

–పేదలందరికీ ఇల్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..!
— వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్
వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా 10వ మహాసభలు ఈరోజు స్థానిక కోతి రాంపూర్ లోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో ఘనంగా జరిగాయి. ఈసందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు కనకం దుర్గాప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రాయికంటి శ్రీనివాస్ అధ్యక్షతన మహాసభ జరిగింది.

ఈ సందర్భంగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు B.ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిత్యవసర సరుకులు ధరలు పెంచి వ్యవసాయ కూలీల బతుకులు చిద్రం చేసిందన్నారు. నిత్యవసర సరుకులపై GST వేసి,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటాలు పంచుకొని పేదలను దోచుకుని తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఎన్నికల ముందు తన అధికారంలోకి వస్తే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని పేదల ఓట్లతోటి గెలిచి 8 సంవత్సరాలు అయినా నేటికీ ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు.

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని దళితులను దగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి, పేదలకు పంచకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం మూలంగా శిధిలవస్థకు చేరుకున్నా యని అన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పేదలకు పంచాలని,లేదంటే పేదలను కలుపుకొని వెళ్లి తాళాలు పగలగొట్టి, పేదలతో ఆక్రమిస్తామని, జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
కార్పొరేట్ శక్తులు భూస్వాములు ఆక్రమించిన ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలకు 100 గజాల స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

భూమున్నవారికి రైతుబంధు ఇవ్వడం మూలంగా సంపన్నవర్గాలకే లాభం చేకూరుతుందని,అసలే భూమిలేని పేదల సంగతి ఏంటని ప్రశ్నించారు? ప్రభుత్వ భూములన్ని గుర్తించి ఆధ్వర్యంలో గుడిసెలు వేసి ఆక్రమిస్తామని కరీంనగర్ జిల్లాలో భూ పోరాటం మొదలు పెట్టబోతున్నామని,ఈ భూ పోరాటంలో అర్హులైన పేదలందరూ పాల్గొని, భూపోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంటి జగాలున్నవారికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి  కరీంనగర్ జిల్లాలోని ఎలుకతుర్తి మండలం లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సాధించామని అదే స్ఫూర్తితో జిల్లాలో కొనసాగిస్తామని తెలిపారు.

ఈ మహాసభల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి గుడికందుల సత్యం,రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యులు మిల్కూరివాసుదేవారెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి,GMPS కార్యదర్శి సురేష్ యాదవ్,CITU శ్రీనివాస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాయికంటి శ్రీనివాస్ వడ్ల రాజు,సహాయ కార్యదర్శి కవ్వంపల్లి అజయ్, ఉపాధ్యక్షులు మాతంగి శంకర్,జిల్లా కమిటీ సభ్యులు బొగ్గుల రాధిక,మైదం శెట్టి యుగేందర్, మల్లారం బాబు, కనకం దుర్గాప్రసాద్, వడ్లురిమల్లేశం, పాల్గొన్నారు

RSS
Follow by Email
Latest news