తెలంగాణలోకరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 22,384 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 457 మందికి పాజిటివ్ సోకినట్లు వెల్లడైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యధికంగా 285 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే దాని ఎఫెక్ట్ అనేది నగరంలో కలిసిపోయిన సమీప జిల్లాకు సైతం పాకింది. సంగారెడ్డి జిల్లాలో 35, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, రంగారెడ్డి జిల్లాలో 25 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
