Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సరైన మెజారిటీ లేక వీగిపోయిన ఆర్టికల్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

2029 నుంచి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్‌ చట్టం సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ కేంద్ర ప్రభుత్వం సాధించలేకపోయింది. దీనిపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌ లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.

దీంతో మూడింట రెండొంతుల మెజారిటీని ఎన్డీఏ సాధించలేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.  ఈ క్రమంలో మిగతా రెండు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం  ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో… డీలిమిటేషన్‌ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026లను వెనక్కి తీసుకుంది.

ఈ బిల్లులు రాజ్యాంగంపై దాడి చేయడమేనని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లులను ఓడించామని అయన పేర్కొన్నారు. ఇది భారత రాజకీయ నిర్మాణంపై దాడి. దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చే కుట్రను అడ్డుకున్నామని అయన పేర్కొన్నారు. ఇది మహిళా బిల్లు కాదని మేము ముందే స్పష్టంగా చెప్పామని అన్నారు. అయితే, మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మేం వ్యతిరేకం కాదు. 2023 మహిళా బిల్లును అమలు చేయండి.. అప్పుడు మీకు పూర్తిగా సహకరిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లు ముమ్మాటికీ మహిళా బిల్లు కాదని అయన పేర్కొన్నారు.  2023 మహిళా బిల్లును ఆమోదించేందుకు సిద్ధమని ప్రధానికి చెబుతున్నాని అయన అన్నారు.

మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడి పెట్టడాన్ని మిము వ్యతిరేకించామని ప్రియాంకా గాంధీ అన్నారు. కేంద్రం చేస్తున్న కుట్రలను అడ్డుకుని, దిల్లీని ఓడించామని తమిళనాడు సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. దేశ చరిత్రలో సువర్ణదినంగా ఈ రోజు గుర్తుండిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రియతమ నాయకుడు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే ల  నేతృత్వంలో జాతీయ విపత్తును అడ్డుకున్నామని అన్నారు.

RSS
Follow by Email
Latest news