Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు..

ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు సమ్మె కు సిద్దమౌవుతున్నారు.  ఏపీఎస్ఆర్టీసీకి నాలుగు రోజుల సమయం ఇస్తూ సమ్మె సైరన్ మోగించారు. తమకు స్త్రీ శక్తి వల్ల ఏర్పడిన భారాలను తగ్గించుకోవడానికి అద్దె రూ. 20వేలు పెంచాలని కోరినా కేవలం రూ. 5 వేలే పెంచారని ఆందోళనకు దిగారు. ఓఆర్ మీద దృష్టి పెట్టారే తప్ప తమ గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో సానుకూల నిర్ణయం రాకపోతే సమ్మె చేస్తామని అద్దె బస్సుల యజమానుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు.

స్త్రీ శక్తి వచ్చాక బస్సుల్లో ఓఆర్ పెరిగిందని అద్దె బస్సుల యజమానుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 100 మంది ఎక్కుతున్నారు.. బస్సులో ప్రయాణీకులు పెరగడంతో బస్సు రిపేర్ ఖర్చులు పెరిగిపోయాయి.. మా ఇన్సూరెన్స్ ల కవరేజీల గురించి పట్టదా అని ప్రశ్నించారు. మా డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. యజమానుల బస్సులు నడపడానికి డ్రైవర్లు, కండక్టర్లు,  ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు. చాలా చోట్ల బస్సులకు ప్రమాదాలు జరిగాయి.. బస్సు కాలపరిమితితో పని లేకుండా మార్పులు చేసి నడిపిస్తున్నారు.. మా డిమాండ్ పై నాలుగు రోజుల్లో ఆశించిన సమాధానం రాకపోతే తమ బస్సులను నిలిపివేసి సమ్మె కు దిగుతామని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌