మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గాసిప్”. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రేపు అనగా ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైలర్ చూసిన ప్రేక్షకులు సినిమా ప్రస్తుత సమాజంలో కొన్ని పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్లు ఈ ట్రైలర్ ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రేపు గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.
సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత యతి మాట్లాడుతూ.. తమ చిత్ర విడుదలకు ఎంతగానో సహకరిస్తున్న ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ‘పివిఆర్ సినిమాస్’కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సినిమాపై లవ్ చూపిస్తున్న ఆడియన్స్‌కు థాంక్స్ చెప్తూ.. కంటెంట్ నమ్మి తీసిన ఇలాంటి చిన్న సినిమాలను థియేటర్లకు వచ్చి ఆదరించాలని కోరారు.
దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ చిత్రంలోని నటించిన నటీనటులకు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిర్మాతకు, విడుదలకు సపోర్ట్ చేస్తున్న పివిఆర్ సినిమాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి చిన్న సినిమాలను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు.
నటీనటులు : రాశి సింగ్, రవివర్మ, మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు.










