ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించే షెడ్యూల్(30.04.2026) ను తెలుగుదేశం పార్టీ పీఆర్వో ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఉదయం 10.10 గంటలకు ఇంటి నుండి బయలుదేరి సచివాలయానికి బయలుదేరుతారు. అనంతరం 10.30 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో పాల్గొంటారు.
తరువాత మధ్యాహ్నం 02.30 గంటలకు నైపుణ్యాభివృద్ధి, విద్య, ఉపాధి కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 06.15 గంటలకు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్తారు. మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో డిన్నర్ మీటింగ్లో పాల్గొంటారు. రాత్రి డిన్నర్ ముగించుకుని 9.10 గంటలకు నివాసానికి చేరుకుంటారు.










