Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈరోజు సీతా నవమి ప్రాముఖ్యత పూజా విధానం

 

ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే సీతా నవమి. ప్రతి సంవత్సరం వైశాఖమాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున సీతా నవమిగా జరుపుకుంటారు. ఈరోజు సీతమ్మ పుట్టినరోజు అనినమ్మకం...

సీతా నవమి.. ఎప్పుడు వస్తుంది :

శ్రీ రామ నవమి తర్వాత ఒక నెలకు వస్తుంది. ఈ రోజున సీత మాత దర్శనమిస్తుందని ప్రతీతి. ఈ రోజును జానకీ నవమి లేదా సీతా జయంతి అని జరుపుకుంటారు. ఈరోజున సీతారాములను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు, మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు, తాము సుమంగళిగా జీవిస్తామని.. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయని నమ్మకం.

సీతా నవమి ప్రాముఖ్యత :

పురాణాల ప్రకారం, ఒకప్పుడు మిథిలా రాజు జనకుడు పొలాలను దున్నుతున్నాడు. ఆ సమయంలో జనకుడికి కుమార్తె రూపంలో సీతమ్మ దొరికింది, తరువాత సీతమ్మ శ్రీరామునితో వివాహం చేసుకుంది, సీతారాములకు లవుడు, కుశుడు అనే ఇద్దరు కుమారులున్నారు, వివాహిత స్త్రీలు సీతానవమి రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తారు.

సీతానవమి రోజున సీతారాములను పూజించిన వారికీ అఖండ సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు. ఈ రోజున సీతామాతను పూజించడం వల్ల తీర్థయాత్రలు, దానధర్మాల చేసినప్పుడు కలిగిన ఫలం కంటే అధిక ఫలితం దక్కుతుందని నమ్మకం. దంపతులు వైవాహిక జీవితంలోని కష్టాలను తొలిగి.. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని నమ్మకం.

సీతా నవమి పూజా విధానం :

సీతా నవమి నాడు తెల్లవారు జామునే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలి. ఇంటిని, పూజగదిని శుభ్రంచేసుకోవాలి, ఒక పీఠం ఏర్పరచుకుని పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని వేసుకోవాలి, అనంతరం సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్టించాలి. సీతాదేవికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, జాకెట్ వంటి మంగళకరమైన వస్తువులను సమర్పించాలి.

నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, అక్షతలు, ఎరుపు, పసుపు పుష్పాలు, ధూపం మొదలైన వాటితో పూజించండి. ఓం సీతాదేవ్యై నమః మంత్రాన్ని, రామ రామ రామ సీత…108 సార్లు జపించడం , నైవేద్యంగా ఆహారపదార్ధాలను సమర్పించాలని పెద్దలు చెబుతారు.

🌸శుభమస్తు🌸
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

RSS
Follow by Email
Latest news