విడుదల తేదీ : ఏప్రిల్ 24, 2026
APTSBREAKINGNEWS.COM : 3/5
నటీనటులు : హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ తదితరులు
దర్శకుడు : సావిన్ ఎస్ఏ
నిర్మాత : విపిన్ దాస్
సంగీతం : ఏ టీమ్
సినిమాటోగ్రఫీ : అఖిల్ లైలాసురన్
ఎడిటర్ : కన్నన్ మోహన్
తక్కువ బడ్జెట్‌తో రూపొంది, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న మలయాళీ మూవీ ‘వాలా2′ ఏప్రిల్ మొదటివారంలో విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకూ ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్స్‌కు వచ్చింది. ఈ యూత్ ఫుల్ డ్రామా ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? రివ్యూలో చూద్దాం.
కథ :
హషీర్ (హషీర్), అలన్ (అలన్ బిన్ సిరాజ్), వినాయక్ (వినాయక్ వి), మరియు అజిన్ (అజిన్ జాయ్) అనే నలుగురు కుర్రాళ్ల కథ ఇది. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆ నలుగురినీ తల్లిదండ్రులు ఎన్నోకష్టాలు పడుతూ కాలేజీకి పంపుతుంటారు. కానీ, వీళ్లు చదువుల్లో కంటే గొడవల్లోనే ముందుంటారు. దాంతో కలిగి నుండి వీరిని సస్పెండ్ చేస్తారు.
ఓ పోలీస్ ఆఫీసర్ (ఆల్ఫోన్స్ పుత్రన్) కలగజేసుకుని వీళ్లని కాపాడతాడు. ఆ తర్వాత పరీక్షలు రాసే అవకాశం వస్తుంది. ఆతరువాత విదేశాలకు వెళ్లి మంచిగా సెట్టిల్ అవ్వలని అనుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరకు వారు తమ కలని నిజం చేసుకున్నారా?లేదా? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాను నిజ జీవిత పేర్లతోనే వాళ్లని చూపిస్తూ సాగే ఇతి వృతాంతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. రచయిత, నిర్మాతల్లో ఒకరైన విపిన్‌దాస్. చదువుపై దృష్టిపెట్టకుండా పెడదారి పట్టే యువకులు, కళాశాలలో గొడవలు, పోలీస్ అధికారి ప్రవేశం, సందేశం… ఇలా దాదాపుగా ఈ సినిమాకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న యువతరం జీవితాల వెనకున్న వాస్తవికత, తోబుట్టువుల మధ్య అనుబంధం నేపథ్యం కూడా మనసుల్ని హత్తుకుంటుంది. వారి మధ్యనున్న అనుబంధం, భావోద్వేగాల్ని ఆవిష్కరించిన తీరు ఈ సినిమాని ప్రత్యేకంగా నిలుపుతుంది. ప్రథమార్ధం సినిమా సరదా సన్నివేశాలతో హాస్యాన్ని పంచగా, ద్వితీయార్ధం సీరియస్ విషయాలతో మనసులకు హత్తుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. యూత్ కు సంబందించిన చిత్రం కావడంతో రొమాంటిక్ ట్రాక్స్ పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ బాగున్నప్పటికీ, కొన్ని చిన్న పాత్రలకు వాయిస్ సింక్ సరిగా కుదరలేదు. ఆ చిన్న పాత్రలే కదా అని దర్శకుడు కొంత నిర్లక్ష్యం చేసినట్లు ఉంది.
నటీనటులు :
కేరళలో సోషల్ మీడియాతో ఫేమస్ అయిన కుర్రాళ్లే ప్రధాన పాత్రధారులుగా నటించారు. సినిమాకి అంతా కొత్తవాళ్లే అయినా మంచి నటనని ప్రదర్శించారు. వారి వారి పాత్రల్లో ఒదిగిపోయి చాలా సహజంగా నటించారు.
టెక్నీకల్ టీం :
సంగీత దర్శకుడు ఏ టీమ్ ఈ సినిమాకి మంచి సంగీతాన్ని అందించారు. దర్శకుడు సావిన్ ఎస్‌ఏ,విపిన్ దాస్ రాసుకున్న కథని తెరపైకి తీసుకొచ్చిన తీరు ఎంతో ప్రత్యేకం. నిర్మాణ విలువలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉంది.
తీర్పు : సినిమాలో అక్కడక్కడ కొంత బోరింగ్ గా ఉన్నప్పటికీ, మొత్తమీద ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.
aptsbreakingnews.com Rating : 3/5
Reviewed by : Banna Prbhakar,











